: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం... గొడవ కూడా మొదలైంది
ఏపీ శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆ వెంటనే కాల్ మనీ వ్యవహారంపై చర్చకు అనుమతించాలని వైసీపీ సభ్యుడు, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. అయితే వైసీపీ ప్రతిపాదించిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. దీంతో సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ వారు పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్నారు. దీంతో ఎదురు దాడికి దిగిన అధికార పక్ష సభ్యులు కూడా కాల్ మనీలో వైసీపీ నేతల ప్రమేయానికి సంబంధించి ప్రచురితమైన మీడియా కథనాలను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. దీంతో తొలి రోజు సభలోనే గొడవ మొదలైంది.