: బీఏసీ సమావేశం ప్రారంభం... సీఎం చంద్రబాబు హాజరు, డుమ్మా కొట్టిన విపక్ష నేత జగన్
మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా కొద్దిసేపటి క్రితం బీఏసీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి సభా నాయకుడి స్థానంలో సీఎం చంద్రబాబు హాజరు కాగా, విపక్ష నేత హోదాలో ఉన్న జగన్ మాత్రం గైర్హాజరయ్యారు. స్పీకర్ కోడెల శివప్రసాద్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో వైసీపీ తరఫున జ్యోతుల నెహ్రూ, గడికోట శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. ఇక టీడీపీ తరఫున చంద్రబాబుతో పాటు యనమల రామకృష్ణుడు కూడా హాజరయ్యారు. బీజేపీ తరఫున ఆ పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు.