: ప్రభుత్వాధినేతలకు ఆయుష్షు తగ్గుతోందట!


ఏ దేశంలోనైనా ప్రభుత్వాధినేతగా ఎన్నికైన వ్యక్తి ఆయుష్షు తగ్గుతోందని ఓ అధ్యయనం తేల్చింది. తనపై ఓడిన రాజకీయ నాయకుల కంటే గెలుపొందిన రాజకీయ నాయకుడి ఆయుష్షు తగ్గుతోందని ఈ అధ్యయనం పేర్కొంది. ఓడిన నేత కంటే గెలిచిన నేతకు 23 శాతం మృత్యుముప్పు అధికమని ఆ పరిశోన వెల్లడించింది. ఓడిన వారి కంటే గెలిచిన వారు 2.7 ఏళ్లు ముందుగా మృత్యుముఖం చేరుకుంటున్నారని పరిశోధన నిర్వహించిన హార్వార్డ్ యూనివర్సిటీకి చెందిన భారతీయ సంతతి ప్రొఫెసర్ అనుపమ్ జెనా తెలిపారు. 1722 నుంచి 2015 వరకు సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొన్న 17 దేశాలకు చెందిన 279 మంది ప్రజా ప్రతినిధులు, 261 మంది వారి ప్రత్యర్థులను ఈ పరిశోధనకు ఎంచుకున్నట్టు అనుపమ్ జెనా వెల్లడించారు.

  • Loading...

More Telugu News