: రోడ్లపై పరుగులు తీయనున్న ఫోర్డ్ డ్రైవర్ లెస్ కారు


ఫోర్డ్ డ్రైవర్ లెస్ కారు త్వరలోనే అమెరికా రోడ్లపై పరుగులు తీయనుంది. కాలిఫోర్నియా రహదారులపై సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు టెస్ట్ డ్రైవ్ నిర్వహించేందుకు అనుమతి లభించిందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అనుమతులు లభించడంతో నూతన సంవత్సరం టెస్ట్ డ్రైవ్ నిర్వహించనున్నామని వెల్లడించారు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల తయారీ కోసం వంద మంది పరిశోధకులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు పని చేస్తున్నారని ఫోర్డ్ కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతానికి టెస్ట్ డ్రైవ్ నిర్వహిస్తామని, సాంకేతిక సమస్యలను అంచనావేసి, వాటిని పరిష్కరించి, ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పారు. 2020 నాటికి పూర్తి స్థాయిలో ఫోర్డ్ డ్రైవర్ లెస్ కార్లు కాలిఫోర్నియా రోడ్లపై పరుగులు తీస్తాయని వారు వివరించారు. కాగా, ఇప్పటికే గూగుల్ సంస్థ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను టెస్టు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News