: వైకాపా శాసనసభా పక్ష సమావేశం ప్రారంభం


హైదరాబాదులోని లోటస్ పాండ్ లో వైకాపా శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమయింది. వైకాపా అధినేత జగన్ అధ్యక్షతన ఈ భేటీ కొనసాగుతోంది. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరుగుతోంది. అంతేకాకుండా ఏయే విషయాలను అసెంబ్లీలో ప్రస్తావించాలనే అంశంపై కూడా చర్చిస్తున్నారు. ఈ భేటీకి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే కాకుండా ఇతర కీలక నేతలు కూడా హాజరయ్యారు.

  • Loading...

More Telugu News