: లేడీస్ హాస్టల్ లో ఆగంతుకుడు... బెంబేలెత్తిన అమ్మాయిలు


హైదరాబాదులోని ఖైరతాబాదుకు చెందిన ఓ భవన సముదాయంలో ఏర్పాటైన లేడీస్ హాస్టల్ అది. విద్య, ఉద్యోగాల కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అమ్మాయిలకు వసతి, భోజన సౌకర్యాలను అందించేందుకు ఏర్పాటైన ప్రైవేట్ వసతి గృహం. మగాళ్లకు ప్రవేశం నిషిద్ధం. అయితే ఇప్పటికే ఆ హాస్టల్ లోకి పలుమార్లు ఆకతాయిలు ప్రవేశించి నానా రభస చేశారు. అయినా నిర్వాహకులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టిన దాఖలా కనిపించలేదు. నిన్న రాత్రి గుట్టుచప్పుడు కాకుండా ఓ ఆగంతుకుడు కాంపౌండ్ వాల్ ఎక్కేసి నేరుగా హాస్టల్ లోకి దూరేశాడు. అమ్మాయిలు ఉంటున్న గదుల వద్దకు చేరుకున్నాడు. ఆగంతుకుడి అలికిడికి మెలకువ వచ్చిన అమ్మాయిలు అతడిని చూసి బెంబేలెత్తిపోయారు. పెద్దగా కేకలు పెడుతూ పరుగులు తీశారు. దాంతో ఎక్కడ తాను పట్టుబడతానోనన్న భయంతో సదరు ఆగంతుకుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

  • Loading...

More Telugu News