: విశాఖలో కాల్ మనీ వ్యాపారి అరెస్టు
విశాఖపట్టణంలో కాల్ మనీ వ్యవహారం వెలుగు చూసింది. విజయవాడలో కలకలం రేపిన కాల్ మనీ కీచకులు విశాఖలోలో కూడా కాలుపెట్టడంపై పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు. ఆరిలోవలో కాల్ మనీ వ్యాపారం చేస్తూ, పేదల రక్తం పీల్చుతున్న రామకృష్ణ అనే వడ్డీ వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో తొలిసారి విశాఖలో ఈ తరహా వ్యవహారం వెలుగు చూసింది.