: కేసుల నుంచి తప్పించుకునేందుకు కాల్ మనీ కొత్త వ్యూహం


కాల్ మనీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకు 90 కాల్ మనీ వ్యాపారుల ఇళ్లపై దాడులు చేసిన పోలీసులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో కాల్ మనీ వ్యాపారులు అప్రమత్తమవుతున్నారు. విజయవాడతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లోని కాల్ మనీ వ్యాపారులు తమ వ్యాపార లావాదేవీలకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు పోలీసులకు దొరకకుండా జాగ్రత్తపడుతున్నారు. ఈ సందర్భంగా కొంత మంది వాటిని సీక్రెట్ గా దాచేస్తే, మరి కొంత మంది వాటిని పంట కాల్వలలో పడేశారు. దీంతో విజయవాడలోని కాల్వలలో పలు డాక్యుమెంట్లు తేలియాడుతూ పంటపొలాల్లోకి చేరాయి. పూర్తిగా తడిసి ముద్దైపోయిన చెక్కులు, భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు, ప్రాంసరీ నోట్లను చూసిన రైతులు మీడియా, పోలీసులకు సమాచారమందించారు.

  • Loading...

More Telugu News