: లోక్ సభలో బీజేపీ గాంధీ గిరి
పార్లమెంటులో బీజేపీ నేతలు గాంధీ గిరి చూపించారు. కొద్ది రోజుల క్రితం పంజాబ్ లో దళితులపై జరిగిన దాడులను నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు లోక్ సభలో ఆందోళన చేపట్టారు. ప్రశ్నోత్తరాల సమయంలో దీనిపై చర్చను కోరగా, వారి కోరికను స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించారు. దీంతో వెల్ ను చుట్టుముట్టిన కాంగ్రెస్ నేతలు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ, పంజాబ్ అధికార పార్టీ శిరోమణి అకాలీదళ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కొంత మంది బీజేపీ నేతలు వారికి గులాబీ పూలు అందించారు. దీంతో వెల్ అధికార విపక్షాల నేతలతో నిండిపోయింది. దీంతో తమ వారిని మిగిలిన బీజేపీ నేతలు బయటకు తీసుకెళ్లారు.