: వరంగల్ జిల్లాలో సంగీత దర్శకుడు చక్రి కాంస్య విగ్రహావిష్కరణ
దివంగత సంగీత దర్శకుడు చక్రి ప్రథమ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం కంబాలపల్లిలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని పైకొచ్చిన వ్యక్తి చక్రి అని అన్నారు. ఆయన జీవితం భావితరాల వారికి ఆదర్శం అని చెప్పారు. సినీ పరిశ్రమకు చక్రి ఎనలేని సేవలందించారని కొనియాడిన శంకర్ నాయక్, ఆయన తెలంగాణ బిడ్డగా పుట్టడం గర్వకారణమని పేర్కొన్నారు.