: కార్తీకం ముగిసింది... 'గుడ్డు' రికార్డయింది!
కార్తీకమాసం ముగియడంతో కోడి గుడ్ల ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి. ఒక్కో గుడ్డు ధర రూ.5కు చేరింది. ఒక్కసారిగా రూ. 50 పైసల వరకూ కోడి గుడ్డు ధర పెరగడం ఎన్నడూ జరగలేదని వ్యాపారులు చెబుతుండటం గమనార్హం. హోల్ సేల్ మార్కెట్లో 100 గుడ్ల ధర రూ. 405 వరకూ ఉండగా, రిటైల్ వ్యాపారులు ఒక్కో గుడ్డును రూ. 5కు అమ్ముతున్నారు. గత శనివారం వరకూ కార్తీకమాసం సందర్భంగా మాంసం, గుడ్ల వాడకం గణనీయంగా తగ్గగా, వ్యాపారులు సైతం తగ్గింపు ధరలకు వీటిని విక్రయించారు. ఇక చలి పెరగడం, పవిత్ర రోజులు ముగియడంతో గుడ్ల వాడకం ఒక్కసారిగా పెరిగింది. కాగా, 2013లో డిసెంబర్ 21న కోడి గుడ్ల ధర రూ. 4.02కు చేరడం ఓ రికార్డు కాగా, ఇప్పుడది తుడిచిపెట్టుకుపోయింది.