: కొత్త సంవత్సరం నుంచి మరింత కిక్కు!... బార్ల సమయం పెంచేందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్


కొత్త సంవత్సరం నుంచి తెలంగాణ వాసులకు మరింత కిక్కు ఎక్కించేందుకు కేసీఆర్ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రాష్ట్రవ్యాప్తంగా బార్లు ప్రస్తుతం రాత్రి 11 గంటల వరకూ నడుస్తుండగా, ఆ సమయాన్ని 12 గంటల వరకూ పెంచాలని, ఆహార పదార్థాల విక్రయాలను ఒంటి గంట వరకూ కొనసాగించాలని నిర్ణయించినట్టు సమాచారం. పర్యాటకం పరంగా, పారిశ్రామికంగా తెలంగాణ అభివృద్ధి చెందుతున్న వేళ మద్యం విక్రయాల సమయాలు కూడా పెంచాలన్న ప్రతిపాదన చాలా రోజులుగా పరిశీలనలో ఉన్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందునే ఉత్తర్వుల జారీ ఆలస్యమైందని అధికారులు అంటున్నారు. కాగా, పోలీసుల అభ్యంతరాల మేరకు మద్యం షాపుల సమయాన్ని మాత్రం యథాతథంగా ఉంచనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఫైవ్ స్టార్ హోటళ్లు మినహా మిగతా బార్లన్నింటిలో రాత్రి 11 గంటల వరకూ మద్యం అందుబాటులో ఉంది. ముంబైలో రాత్రి 1:30 వరకు, ఢిల్లీలో రాత్రి 12:30 వరకూ, చెన్నైలో రాత్రి 12 వరకు, ఒడిశాలో రాత్రి 1:30 గంటల వరకూ బార్లు తెరచివున్నందున ఇక్కడ కూడా సమయం పెంచాలని, తద్వారా మరింత ఆదాయం ఖజానాకు చేర్చవచ్చన్నది తెలంగాణ సర్కారు ఆలోచనగా తెలుస్తోంది.

  • Loading...

More Telugu News