: కేసీఆర్ ఏపీ వెళ్లి ఎందుకు రొయ్యలు తినొచ్చాడో తెలుసా?: మధుయాష్కీ గౌడ్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ కి వెళ్లి రొయ్యలు తిని రావడం వెనుక చాలా పెద్ద ప్లాన్ ఉందని కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, త్వరలో హైదరాబాదులో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీమాంధ్రులను ఆకట్టుకునేందుకే కేసీఆర్ విజయవాడ వెళ్లి రొయ్యలు తిని వచ్చాడని అన్నారు. హైకోర్టుపై రెండు రోజులు హడావుడి చెయ్యడం, తరువాత మర్చిపోవడం కేసీఆర్ కు అలవాటుగా మారిందని ఆయన పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కేసీఆర్... ఈటెల రాజేందర్, బాల్క సుమన్ ను వెంటేసుకుని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు దగ్గరకు వెళ్లాడని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News