: 'బాజీరావు'కి 'భజరంగీ'ని మించిన థియేటర్లు


ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించిన 'భజరంగీ భాయ్ జాన్'ను విడుదలకు ముందే 'బాజీరావు మస్తానీ' సినిమా అధిగమించింది. ఓవర్ సీస్ లో రేపు 'బాజీరావు మస్తానీ' 850 స్క్రీన్ లలో విడుదల కానుంది. బాలీవుడ్ లో అత్యధిక స్క్రీన్ లలో విడుదలవుతున్న సినిమా ప్రస్తుతానికి ఇదే కావడం విశేషం. ఇంతవరకు అత్యధిక స్క్రీన్ లలో 'భజరంగీ భాయ్ జాన్' సినిమా విడుదలైంది. 800 స్క్రీన్ లలో విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ట్రైలర్లు, టీజర్లు, ప్రమోషన్ తో 'బాజీరావు మస్తానీ' అందర్లోనూ అంచనాలు పెంచింది. తాజాగా భారీ ఎత్తున విదేశాల్లో విడుదల చేయడంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. కాగా, ఈ సినిమా డిసెంబర్ 18న భారత్ లో విడుదల కానుంది.

  • Loading...

More Telugu News