: కాల్ మనీ వ్యవహారంపై హెచ్ఆర్సీ స్పందన... ఏపీ సీఎస్ కు నోటీసులు
విజయవాడ కాల్ మనీ వ్యవహారంపై ఏపీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. జనవరి 18లోగా నోటీసులకు వివరణ ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. కాల్ మనీ కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపించి వాస్తవాలను వెలుగులోకి తెచ్చి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలంటూ న్యాయవాది అరుణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన హెచ్ఆర్సీ పైవిధంగా స్పందించింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో పలువురిని అరెస్టు చేసిన పోలీసులు మరికొంతమంది కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. కాల్ మనీ వ్యాపారులకు డబ్బులు చెల్లించవద్దని స్వయంగా సీఎం చంద్రబాబే ఇవాళ స్పష్టం చేశారు.