: విజయవాడ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరిన కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ విజయవాడ పర్యటన ముగిసింది. అనంతరం సీఎం చంద్రబాబు నివాసానికి దగ్గరలోని హెలీప్యాడ్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కేసీఆర్, మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ బాల్క సుమన్ హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. తిరిగి వెళ్లే సమయంలో కూడా మంత్రులు యనమల రామకృష్ణుడు, రావెల కిషోర్ బాబు, అచ్చెన్నాయుడు, అధికారులు వీడ్కోలు పలికారు. అంతకుముందు చంద్రబాబును ఆయన నివాసంలో కలసిన కేసీఆర్ కుటుంబ సభ్యులతో అయుత చండీయాగానికి రావాలని ఆహ్వానించారు. అనంతరం విందు స్వీకరించారు. కేసీఆర్ స్వయంగా విజయవాడ వచ్చి చంద్రబాబును కలవడం, ఆహ్వానించడం ప్రత్యేకంగా నిలిచింది. ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కుమార్తె వివాహ విందుకు వెళ్లిన ఇద్దరు చంద్రులు ఒకరికొకరు ఎదుటపడ్డారు. మళ్లీ కొన్నిరోజులకే వారిద్దరూ కలవడం మీడియాలో హాట్ టాపిక్కైంది.