: బెజవాడ చేరుకున్న కేసీఆర్... ఘన స్వాగతం పలికిన ఏపీ మంత్రులు


టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొద్దిసేపటి క్రితం విజయవాడలో ల్యాండయ్యారు. నేటి ఉదయం 11.30 గంటలకు హైదరాబాదు నుంచి ప్రత్యేెక హెలికాప్టర్ లో బయలుదేరిన కేసీఆర్, కొద్దిసేపటి క్రితం విజయవాడ చేరుకున్నారు. విజయవాడలో ల్యాండైన కేసీఆర్ కు ఏపీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, కింజరాపు అచ్చెన్నాయుడు, రావెల కిశోర్ బాబు, కామినేని శ్రీనివాస్ తదితరులు ఘన స్వాగతం పలికారు. మరికాసేపట్లో కేసీఆర్, చంద్రబాబుతో భేటీ కానున్నారు.

  • Loading...

More Telugu News