: కేసీఆర్ కు చంద్రబాబు ఇస్తున్న నోరూరించే విందు మెనూ ఇదే!
మరికాసేపట్లో కలవనున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలసి భోజనం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ కోసం నోరూరించే 15 రకాల వంటకాలతో కూడిన మెనూను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సిద్ధం చేయించారు. తన ఇంటికి సమీపంలోని హెలిపాడ్ లో దిగే కేసీఆర్ ను స్వయంగా స్వాగతం పలికి ఆహ్వానించనున్న చంద్రబాబు, ఆ వెంటనే విందుకు తీసుకు వెళతారని, విందు తరువాతనే అయుత మహా చండీయాగానికి రమ్మని ఆహ్వానిస్తూ, కేసీఆర్ ఆహ్వాన పత్రికను అందిస్తారని తెలుస్తోంది. కేసీఆర్ కు విందు కోసం అచ్చ తెలుగింటి రుచులను సిద్ధం చేశారు. గోంగూర, ఉలవచారు, నాటుకోడి పులుసు, టమోటా పప్పు, మజ్జిగ పులుసు, మునక్కాయ సాంబారు, బిరియానీ, గడ్డ పెరుగులతో పాటు పూతరేకులు, కాజాలు వంటి స్వీట్స్, వివిధ రకాల పండ్ల ముక్కలు తదితరాలను ఇప్పటికే రెడీ చేసినట్టు తెలుస్తోంది.