: అసెంబ్లీ ఎన్నికల్లోగానే అమరావతిలో పరిపాలనా నగరం: చంద్రబాబు


ఎట్టి పరిస్థితుల్లోనూ తదుపరి అసెంబ్లీ ఎన్నికలు జరిగేలోగా అమరావతి పరిధిలో అడ్మిన్ సిటీ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ఉదయం విజయవాడలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన, అందుకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. 2018లోగా సచివాలయం, అసెంబ్లీ, అన్ని శాఖల కార్యాలయాలతో బాటు ఉద్యోగుల నివాసాల నిర్మాణాన్ని కూడా పూర్తి చేస్తామని అన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దే బాధ్యత కలెక్టర్లపైనే ఉందని, అన్ని సంక్షేమ పథకాలనూ పేదలకు అందించాలని సూచించారు. రైతులకు బ్యాంకుల నుంచి రుణాలు అందుతున్నాయా? లేదా? అన్న విషయాన్ని కలెక్టర్లు పర్యవేక్షించాలని తెలిపారు.

  • Loading...

More Telugu News