: టార్గెట్ 2029... దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఏపీ: చంద్రబాబునాయుడు


2029లోగా ఏపీని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. విజయవాడలో కొద్దిసేపటి క్రితం జిల్లా కలెక్టర్ల సమావేశం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశంలో ప్రారంభోపన్యాసం చేసిన చంద్రబాబు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయడంలో కలెక్టర్లు, ఇతర జిల్లా అధికార యంత్రాంగం చురుగ్గా పనిచేయాలని సూచించారు. పేదలకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కలెక్టర్లను కోరారు. తక్కువ వర్షపాతం కారణంగా వ్యవసాయంలో ఆశించిన మేర ప్రగతి సాధించలేకపోయామన్నారు. నీరు-చెట్టు పథకం మంచి ఫలితాలననిస్తోందన్నారు.

  • Loading...

More Telugu News