: చిత్తూరు మేయర్ దంపతుల హత్య కోసం ఆర్నెల్ల క్రితమే ప్లాన్... రెండు సార్లు విఫలమైన చింటూ: జిల్లా ఎస్పీ


తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం రేపిన చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త, టీడీపీ కీలక నేత కఠారి మోహన్ దంపతుల హత్య కేసుకు సంబంధించి చిత్తూరు జిల్లా ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ కొద్దిసేపటి క్రితం వివరాలు వెల్లడించారు. ఆరు నెలల క్రితం నుంచే కఠారి దంపతులను హత్య చేసేందుకు చింటూ ప్లాన్ వేశాడని ఆయన తెలిపారు. అప్పటికే రెండు సార్లు హత్య చేసేందుకు యత్నించి విఫలమైన చింటూ రాయల్ అలియాస్ శ్రీరామ చంద్రశేఖర్ మూడోసారి మాత్రం పక్కా పథకం ప్రకారం కఠారి దంపతులను హత్య చేశాడని చెప్పారు. ఈ కేసులో మొత్తం 23 మందికి ప్రమేయం ఉందని నిర్ధారించామన్నారు. ఇప్పటికే 20 మందిని అరెస్ట్ చేశామని చెప్పిన ఎస్పీ, మరో ముగ్గురిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News