: జర్మనీలో ఫేస్ బుక్ కార్యాలయంపై దాడి ...‘ఫేస్ బుక్ డిస్ లైక్’ అంటూ గోడలపై రాతలు


జర్మనీ నగరం హాంబర్గ్ లోని ఫేస్ బుక్ కార్యాలయంపై గుర్తు తెలియని దుండగులు నిన్న దాడికి పాల్పడ్డారు. నలుపు రంగు దుస్తులు వేసుకున్న దాదాపు 20 మంది ముఖాలకు మాస్కులు వేసుకుని కార్యాలయంపై దాడి చేశారు. ఈ దాడిలో కార్యాలయం అద్దాలు పగిలిపోయాయి. గోడలపై పెయింట్ చల్లిన దుండగులు ‘ఫేస్ బుక్ డిస్ లైక్’ అంటూ రాతలు రాశారు. ఫేస్ బుక్ లో పోస్టవుతున్న జాతి వివక్ష వ్యాఖ్యలను తొలగించడంలో ఫేస్ బుక్ యాజమాన్యం విఫలమైన కారణంగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఫేస్ బుక్ యూరప్ చీఫ్ జర్మనీలో విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News