: కారు-ఆటో ఢీ... ఐదుగురు సజీవదహనం!


కారు - ఆటో ఢీ కొన్న సంఘటనలో ఐదుగురు సజీవదహనం చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా పొట్యాల వద్ద ఆదివారం సాయంత్రం జరిగింది. కారు-ఆటో ఢీ కొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆటోలోని ప్రయాణికుల్లో ఐదుగురు ఆ మంటల్లో చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు తోటి ప్రయాణికులు కూడా సాహసం చేసి వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఆటోలో చిక్కుకుపోయిన మృత దేహాలను ఇంకా బయటకు తీయాల్సి ఉంది. మృతులను ఆదిలాబాద్ జిల్లా వాంకిడి వాసులుగా గుర్తించారు. క్షతగాత్రులను గోదావరి ఖని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News