: మంచినీటి పైపులైన్ లీక్... రోడ్లు జలమయం... స్పందించని అధికారులు!
హైదరాబాదులోని బోరబండలో మంజీర వాటర్ పైప్ లైన్ లీకవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ట్రాఫిక్ సమస్య నెలకొంది. పాదచారులు తీవ్రఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి స్పందన లేదు. గంటలు గడుస్తున్నప్పటికీ లీకైన మంచినీటి పైప్ లైన్ కు ఎటువంటి మరమ్మతులు చేపట్టకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. అసలే, మంచినీటి సమస్యతో సతమతమవుతుంటే, వృథాగా పోతున్న నీటిని పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు.