: నీతి, నిజాయతీ ఉంటే వారి పేర్లు చెప్పు!: చంద్రబాబుకు వైకాపా సవాల్


రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తున్న బెజవాడ కాల్ మనీ కేసులో నిందితుల పేర్లను బయటపెట్టాలని వైకాపా నేత పార్థసారధి సవాల్ విసిరారు. నీతి, నిజాయతీలు రక్తంలో ఉన్నాయని చెప్పుకునే చంద్రబాబు, ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నిందితుడితో విదేశీ టూర్ కు వెళ్లిన దేశం ఎమ్మెల్యేను తక్షణం సస్పెండ్ చేయాలని ఆయన కోరారు. కాల్ మనీ నిర్వాహకులను ఎన్ కౌంటర్ చేయాలని పార్థసారధి డిమాండ్ చేశారు. ఏపీ రాజధాని వడ్డీ మాఫియా చేతుల్లో చిక్కుకుపోయిందని, ప్రభుత్వం కళ్లు మూసుకుపోయిందని, చంద్రబాబు ఆదేశాలతోనే పోలీసులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జోలికి వెళ్లడం లేదని ఆరోపించారు.

  • Loading...

More Telugu News