: డ్రైవర్ నిద్రమత్తుతో పోలీసు వాహనానికి ప్రమాదం... దేవరపల్లి సీఐకి తీవ్రగాయాలు
పెట్రోలింగ్ నిర్వహించి తిరుగు ప్రయాణంలో వెళ్తున్న ఓ పోలీసు జీప్ చెట్టును ఢీకొన్న ఘటనలో పోలీసులకు తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటన నేటి తెల్లవారుఝామున నల్గొండ జిల్లా గుర్రంపోడులో జరిగింది. పెట్రోలింగ్ అనంతరం దేవరపల్లి వెళ్తున్న వీరి వాహనం ఓ చెట్టును ఢీకొంది. ఘటనలో సీఐ వెంకటరెడ్డికి తీవ్రగాయాలు కాగా, హోంగార్డు సాంబయ్య కాలు విరిగింది. గాయపడిన వారిని నల్గొండలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా, వెంకటరెడ్డి పరిస్థితి విషమంగా ఉందని, డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని భావిస్తున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.