: గంగా ఘాట్ వద్ద మోదీని అనుకరించిన షింజో అబే!


సాధారణంగా ఏ దేశంలో పర్యటిస్తున్నా, ఏ ముఖ్య నేతతో సమావేశమైనా, భారత ప్రధాని మోదీ అప్పటికప్పుడు తన సెల్ ఫోన్ ద్వారా ఓ సెల్ఫీ తీసుకుని దాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం ఆయన అలవాటన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక భారత పర్యటనకు వచ్చిన జపాన్ ప్రధాని షింజో అబే, మోదీని అనుకరిస్తూ, ఆయనతో స్వయంగా సెల్ఫీ తీసుకోవడం అందరినీ ఆకర్షించింది. నిత్యమూ కాశీ విశ్వేశ్వరుడికి సాయంత్రం వేళ ప్రత్యేక పూజల అనంతరమే, గంగా హారతి నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇద్దరు ప్రధానులు రాగా, అప్పటికి ఇంకా మహాదేవుడి పూజలు ముగిసినట్టు సమాచారం రాలేదు. దీంతో వీరిరువురూ 'దశాశ్వమేధ' ఘాట్ లో కాసేపు వేచి చూడాల్సి వచ్చింది. ఆ సమయంలోనే షింజో తన మొబైల్ నుంచి సెల్ఫీ తీసుకున్నారు. ఆపై 9 మంది పండితులు, 18 మంది దేవకన్యలు కలసి గంగమ్మకు ఇచ్చిన హారతిని షింజో ఆసక్తిగా తిలకించారు.

  • Loading...

More Telugu News