: ఐఎస్ఐఎస్ తో సంబంధాల నేపథ్యంలో మహిళను కెన్యాకు తిప్పిపంపిన కేంద్రం
ఐఎస్ఐఎస్ తో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో హైదరాబాదులో ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కెన్యాకు చెందిన అమీనా అనే మహిళ కొద్ది రోజుల క్రితం హైదరాబాదు వచ్చింది. రెండు నెలల విడిది కోసం తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి హైదరాబాదు వచ్చిన ఆమెను సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐఎస్ తో ఆమెకు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో విచారించింది. అనంతరం ఆమెకు ఐఎస్ తో సంబంధాలు ఉన్నాయని సిట్ నిర్ధారించింది. దీంతో ఎన్ఐఏ, భద్రతా బలగాలు ఐఎస్ఐఎస్ కు సంబంధించి కొంత సమాచారం ఆమె నుంచి సేకరించాయి. కేంద్ర భద్రతా బలగాలు, ఐఎన్ఏ, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆమెను కెన్యా తిరిగి పంపించేశారు.