: ఆరు స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు: భన్వర్ లాల్


తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థల కోటాలో శాసనమండలికి జరుగుతున్న ఎన్నికల్లో ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి భన్వర్ లాల్ ప్రకటించారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్ ఎమ్మెల్సీ స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నిక జరిగిందని తెలిపారు. ఇక మిగిలిన రంగారెడ్డిలో రెండు స్ధానాలకు ఐదుగురు, మహబూబ్ నగర్ లో రెండు స్థానాలకు ఐదుగురు పోటీలో ఉన్నారని చెప్పారు. నల్గొండలో ఒక స్థానానికి నలుగురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారని విలేకరుల సమావేశంలో వివరించారు. అలాగే ఖమ్మంలో ఒక స్థానానికి ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారన్నారు. ఈ నాలుగు జిల్లాల్లోనే ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ప్రతి ఓటరు అభ్యర్థులకు ప్రాధాన్యత ఓట్లు వేయాలని సూచించారు. కొందరు ఓటర్లను కేరళ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన క్యాంపుకు తరలించారన్న సమాచారంతో అక్కడికి బృందాలను పంపామని, అయితే అక్కడ ఎవరూ దొరకలేదని భన్వర్ లాల్ వివరించారు.

  • Loading...

More Telugu News