: ఆహారం, నీరు కంటే దుప్పట్ల అవసరం ఎక్కువుంది...రామానాయుడు స్టూడియోస్ కి పంపండి: నవదీప్


చెన్నైలో వరద బాధితులకు ఆహారం, నీరు కంటే దుప్పట్ల అవసరం ఎక్కువ ఉందని సినీ నటుడు నవదీప్ తెలిపాడు. చెన్నై వరద బాధితులను ఆదుకునేందుకు 'మన మద్రాస్ కోసం' అంటూ సహాయకచర్యల్లో క్రియాశీలకంగా పాలు పంచుకున్న నవదీప్ స్వయంగా చెన్నై వెళ్లి, సహ నటుడు సిద్ధార్థ్ ని కలిశాడు. ఈ సందర్భంగా సహాయక చర్యల గురించి ఆరాతీశాడు. చెన్నై వాసులకు ఆహారం, నీరు కంటే దుప్పట్ల అవసరం ఎక్కువగా ఉందని సిద్ధార్థ్ చెప్పాడు. దీంతో తన ఫేస్ బుక్ పేజ్ ద్వారా అభిమానులకు నవదీప్ సందేశం పెట్టాడు. ఎవరికి చేతనైన దుప్పట్లు వారు పంపించాలని, దుప్పట్లు ఇవ్వాలనుకున్నవారు రామానాయుడు స్టూడియోస్ కి అందజేయాలని నవదీప్ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News