: వారణాసిలో టాప్ సెక్యూరిటీ... మోహరించిన ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎప్, స్కూబా డైవర్లు


వారణాసిలో ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, స్కూబా డైవర్లను కేంద్ర ప్రభుత్వం మోహరించింది. నేటి సాయంత్రం వారణాసిలోని గంగాహారతి కార్యక్రమంలో జపాన్ ప్రధాని షింజే అబే, ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ నేపథ్యంలో వారణాసిలో 7 వేల మంది సిబ్బందితో భద్రత చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ భద్రత చేపట్టారు. కాగా, వారణాసిలోని గంగా తీరంలో దశశ్వమేధ్ ఘాట్ లో హారతి కార్యక్రమంలో వీరు పాల్గొంటారు. ఉత్తరప్రదేశ్ లోని బాబత్ పురా విమానాశ్రయం నుంచి ఇద్దరు ప్రధానులు దశశ్వమేధ్ ఘాట్ కు చేరుకుంటారు.

  • Loading...

More Telugu News