: షబ్బీర్ అలీకి భద్రత కల్పించండి: రాజ్ నాథ్ కు దిగ్విజయ్ లేఖ
తెలంగాణ శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీని చంపుతామంటూ బెదిరింపు కాల్స్ రావడంపై రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ స్పందించారు. ఈ విషయమై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు. రాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకుంటారన్న నమ్మకం లేదని... అందువల్ల షబ్బీర్ భద్రతను కేంద్రమే చూసుకోవాలని లేఖలో కోరారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే, చంపేస్తామంటూ షబ్బీర్ అలీకి నిన్న బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై హైదరాబాదు జూబ్లీహిల్స్ పోలీసులకు కూడా షబ్బీర్ ఫిర్యాదు చేశారు.