: జపాన్ సోషల్ మీడియా ట్రెండ్ 'రైస్ బాల్ బేబీ'


జపాన్ సోషల్ మీడియాలో 'రైస్ బాల్ బేబీ' ట్రెండ్ అవుతోంది. 'ఐస్ బకెట్' ఛాలెంజ్ తరహాలో 'రైస్ బాల్ బేబీ' ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతూ నెటిజన్లు సందడి చేస్తున్నారు. జపాన్ సంప్రదాయ వంటకం 'రైస్ బాల్' షేప్ లో చిన్న పిల్ల ముఖాలను రెండు చేతులతో ఒడిసి పట్టుకుని ఫోటో తీసి ఆ ఫోటోను ట్విట్టర్లో పెడుతున్నారు. దీంతో ఎవరి ట్విట్టర్ ఖాతా చూసినా 'రైస్ బాల్ బేబీ' ఫోటో ఉంటోంది. గతంలో 'ఐస్ బకెట్' ఛాలెంజ్ సమయంలో కూడా ఇలా వేలం వెర్రిగా వీడియోలు పెట్టారు. ఇప్పుడు ఫోటోలు పెడుతూ, లైకులు, కామెంట్లు, షేర్లు చూసుకుని మురిసిపోతున్నారు.

  • Loading...

More Telugu News