: తారా చౌదరికి రిమాండ్... సబ్ జైలుకు తరలింపు
సొంత వదిన కవితపై దాడి చేసిన ఘటనలో సినీ నటి తారా చౌదరిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఘర్షణ వద్దని నచ్చజెప్పేందుకు వెళ్లిన మహిళా కానిస్టేబుల్ పై కూడా ఆమె దాడి చేసింది. ఈ నేపథ్యంలో, ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ రోజు విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు. కేసును విచారించిన కోర్టు... తారా చౌదరికి ఈ నెల 23వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో, ఆమెను విజయవాడలోని సబ్ జైలుకు పోలీసులు తరలించారు.