: అమెరికా స్కూళ్లను టార్గెట్ చేసిన ఉగ్రవాదులు?
అమెరికాలోని స్కూళ్లను ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్టు ఎఫ్ బీఐ అధికారులు అంచనా వేస్తున్నారు. కాలిఫోర్నియాలో పాకిస్థాన్ సంతతికి చెందిన అమెరికన్ జంట ఇటీవల కాల్పులకు తెగబడింది. అనంతరం భద్రతా సిబ్బంది జరిపిన ఎదురు దాడుల్లో వారు హతమయ్యారు. ఈ క్రమంలో, ఉగ్రవాది సయ్యద్ ఫరూక్ మొబైల్ లో కార్టర్ హైస్కూలుకు చెందిన అనేక ఫొటోలను ఎఫ్ బీఐ అధికారులు గుర్తించారు. దీంతో, స్కూళ్లపై ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశం ఉందన్న అనుమానంతో పలు విద్యాలయాల్లో భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ వివరాలను 'సన్' పత్రిక వెల్లడించింది.