: కవలలకు జన్మనిచ్చిన 'యాహూ' సీఈవో


'యాహూ' సీఈవో మరిస్సా మేయర్ కవల ఆడపిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని తనే 'టుంబ్లర్'లో వెల్లడించారు. కుటుంబ సభ్యులకు, తనకు సహకరించిన మిగతావారందరికి మరిస్సా ధన్యవాదాలు తెలిపారు. ఆమె భర్త బోగ్ కూడా 'డూయింగ్ గ్రేట్' అంటూ ట్వీట్ చేశాడు. ఇప్పటికే ఈ దంపతులకు మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. 2012, జులై నుంచి యాహులో చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా పనిచేస్తున్న మరిస్సా... తదనంతర కాలంలో ఆ సంస్థలో సీఈవో స్థాయికి ఎదిగారు. తొలిసారి బాబు పుట్టిన సమయంలో 16 వారాలు ఉద్యోగానికి మెటర్నిటీ సెలవు పెట్టినప్పటికీ, కేవలం నాలుగు వారాల్లోనే ఆమె ఉద్యోగ బాధ్యతల్లో చేరారు. ఈసారి మరిస్సా కేవలం రెండు వారాలు మాత్రమే సెలవు తీసుకున్నారు.

  • Loading...

More Telugu News