: నాలుగో వికెట్ కు 438 పరుగుల భాగస్వామ్యం... టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఆల్ టైం రికార్డు


టెస్టు క్రికెట్ చరిత్రలో మరో సరికొత్త రికార్డు నమోదైంది. హోబర్ట్ తో వెస్టిండీస్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో ఆడమ్ వోగ్స్, షాన్ మార్ష్ జోడీ నాలుగో వికెట్ కు 438 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. దీంతో 2009లో కరాచీలో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ పై శ్రీలంక జోడీ మహేల జయవర్ధనేనే, తిలాన్ సమరవీర నెలకొల్పిన 437 పరుగుల రికార్డు తుడిచిపెట్టుకు పోయింది. ఈ మ్యాచ్ లో 583 పరుగుల భారీ స్కోరుపై ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేయగా, విండీస్ జట్టు 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసి ఎదురీదుతోంది. వోగ్స్ 269 పరుగులతో నాటౌట్ గా నిలువగా, మార్ష్ 182 పరుగులు చేసి ఔటయ్యాడు.

  • Loading...

More Telugu News