: జియోమీ నుంచి 'సీక్రెట్ న్యూ ప్రొడక్ట్'... భారీ క్రిస్మస్ ఆఫర్లు కూడా!
తక్కువ ధరల్లో హైఎండ్ ఫీచర్లున్న స్మార్ట్ ఫోన్లను మార్కెటింగ్ చేస్తూ, ఇండియాలో దూసుకెళ్తున్న చైనా కంపెనీ జియోమీ, తాజాగా వచ్చే మంగళవారం నాడు 'సీక్రెట్ న్యూ ప్రొడక్ట్'ను పరిచయం చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ అఫీషియల్ వెబ్ సైట్లో టీజర్ ను ఉంచింది. అయితే, ఇది సంస్థ విడుదల చేస్తుందని భావిస్తున్న రెడ్ మీ నోట్ 2 ప్రైమ్ కాదని, మరేదో ప్రొడక్ట్ అయివుంటుందని నిపుణులు భావిస్తున్నారు. దీంతో పాటు క్రిస్మస్ సందర్భంగా పలు ఆఫర్లు కూడా ఇస్తామని జియోమీ వెల్లడించింది. ప్రతి ఎంఐ 4ఐ కొనుగోలుతో సాఫ్ట్ కేస్, ఎల్ఈడీ లైట్ ఇస్తామని, రెడ్ మీ 2 కొనుగోలుతో బ్యాక్ కవర్, రెడ్ మీ 2 ప్రైమ్ తో ఎల్ఈడీ లైట్, ఎంఐ పాడ్ తో హెడ్ ఫోన్స్ ఇవ్వనున్నట్టు వెల్లడించింది. ఈ ఆఫర్లు మంగళవారం మాత్రమే అందుబాటులో ఉంటాయని, ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకూ కొనుగోలుదారుల్లో గంటకు ఒకరిని ఎంపిక చేసి ఆకర్షణీయ బహుమతులు ఇస్తామని పేర్కొంది.