: చెన్నై వరదలను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించింది: జయలలిత


చెన్నైని ముంచెత్తిన వరదలను కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించిందని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తెలిపారు. చెన్నైలో ఆమె మాట్లాడుతూ, కేంద్రం వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించినట్టు తమకు సమాచారం అందిందని అన్నారు. కాగా, గత వందేళ్లలో ఎన్నడూ కురవని రీతిలో వర్షాలు పడడంతో చెన్నైని వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. దీంతో చెన్నై మహానగరం నీటమునిగింది. జనజీవనం స్తంభించింది. దీంతో డిసెంబర్ 3న ప్రధాని నరేంద్ర మోదీ చెన్నైలో పర్యటించి వెయ్యి కోట్ల రూపాయల సహాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పట్లో దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించి సహాయ సహకారాలు అందించాలని జయలలిత ప్రధానిని కోరారు. దీంతో కేంద్రం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News