: నా పెంపుడు కుక్కను పోలీసులు వేధిస్తున్నారు: సోమ్ నాథ్ భారతి
తన పెంపుడు కుక్క డాన్ (12) ను ఢిల్లీ పోలీసులు వేధిస్తున్నారంటూ ఆప్ ఎమ్మెల్యే సోమ్ నాథ్ భారతి ఆరోపించారు. కేసు విచారణ విషయంలో పోలీసులకు ఎటువంటి ఇబ్బంది కల్గించకుండా తాను సహకరిస్తున్నానని ఆయన అన్నారు. విచారణ పేరిట తన పెంపుడు కుక్కను పోలీసులు వేధించడం సబబు కాదన్నారు. భార్య గర్భవతిగా ఉన్న సమయంలో సోమ్ నాథ్ తన పెంపుడు కుక్కను ఆమెపై ఉసిగొల్పాడంటూ లిపికామిత్రా చేసిన ఫిర్యాదులు సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. కాగా, సోమ్ నాథ్ భారతిపై గృహహింస, హత్యాయత్నం కేసును పోలీసులు నమోదు చేయడం, ఎవ్వరికీ కనపడకుండా కొన్నాళ్లు ఆయన తప్పించుకు తిరగడం, ఆ తర్వాత చోటుచేసుకున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో సోమ్ నాథ్ కోర్టు ఎదుట లొంగిపోవడం తెలిసిందే.