: శరద్ పవార్ ను ఆకాశానికెత్తిన మోదీ


నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఆకాశానికెత్తారు. శరద్ పవార్ జన్మదిన వేడుకలను ఢిల్లీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ, పవార్ ను పొగడ్తల్లో ముంచెత్తారు. శరద్ పవార్ జీవితం నిండా క్రియాశీలక రాజకీయాలే ఉంటాయని అన్నారు. ఆయన నడిచి వచ్చిన మార్గమంతా ఆయనకు నమస్కారం చేస్తోందని పేర్కొన్నారు. నిత్యం ప్రజలతో మమేకమై ఉండడమే ఆయన విజయ రహస్యమని మోదీ తెలిపారు. నిత్య ఆలోచనలే ఆయనను క్రియాశీలకంగా ఉంచాయని అన్నారు. మహారాష్ట్ర సహకార విధానానికి వెన్నెముక శరద్ పవారేనని ఆయన కొనియాడారు.

  • Loading...

More Telugu News