: చెందా వాయిద్యంతో అలరించిన సోనాక్షి సిన్హా!
రోమ్ లో ఉంటే రోమన్లలా ఉండాలి.. మరి, కేరళలో ఉంటే అక్కడి ప్రజల్లా ఉండాలంటూ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా పేర్కొంది. బాలీవుడ్ అగ్ర నటుడు, ఆమె తండ్రి శత్రుఘ్న సిన్హా 70వ జన్మదినం సందర్భంగా కేరళలోని అలప్పుజ ఆలయానికి వారు వెళ్లారు. అక్కడి ఆలయ ప్రాంగణంలో కేరళ సంప్రదాయ సంగీత వాయిద్యాల్లో ఒకటైన ‘చెందా’ను మహిళా కళాకారులు కొందరు వాయిస్తున్నారు. ఆ కళాకారులతో కలిసి ఆమె కూడా చెందా వాయిద్యాన్ని కొద్దిసేపు తనదైన శైలిలో వాయించింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు.