: న్యాయవ్యవస్థ నిర్ణయాన్ని వినయంతో అంగీకరిస్తున్నా: సల్మాన్


హిట్ అండ్ రన్ కేసులో నిర్దోషిగా రుజువై బయటపడిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ బాంబే హైకోర్టు తీర్పుపై ట్విట్టర్ లో స్పందించాడు. తనకు అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. "న్యాయవ్యవస్థ నిర్ణయాన్ని వినయంతో అంగీకరిస్తున్నా. ఈ సమయంలో నాకు అండగా నిలిచిన, ప్రార్థనలు చేసిన నా కుటుంబం, స్నేహితులు, అభిమానులకు కృతజ్ఞతలు" అని సల్మాన్ ట్వీట్ చేశాడు. 13 సంవత్సరాల సుదీర్ఘ విచారణ తరువాత ఈ కేసులో సల్మాన్ కు శాశ్వత ఊరట లభించింది. అతనిపై ఉన్న అభియోగాలు, స్థానిక కోర్టు విధించిన ఐదు సంవత్సరాల జైలు శిక్షను, జరిమానాను ఈరోజు హైకోర్టు కొట్టివేసింది.

  • Loading...

More Telugu News