: ఆక్షేపించిన సుప్రీంకోర్టు, వెనక్కు తగ్గిన తెలంగాణ


కృష్ణా నదీ జలాలను ఎలా పంపిణీ చేయాలన్న విషయమై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న వేళ, తమ వాదనలు వినిపించేందుకు మరింత సమయం కావాలని తెలంగాణ ప్రభుత్వం విన్నవించగా, ధర్మాసనం అందుకు నిరాకరించింది. మరింత సమయం కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం కేసు విచారణను పొడిగించేందుకేనని అభిప్రాయపడ్డ న్యాయమూర్తి, తెలంగాణ సర్కారు వైఖరిని ఆక్షేపించారు. ఇదే సమయంలో తెలంగాణ సమయం కోరడంపై మహారాష్ట్ర, కర్ణాటక అభ్యంతరం తెలిపాయి. దీంతో తెలంగాణ తరఫు న్యాయవాది వెనక్కు తగ్గి తన పిటిషన్ ను ఉపసంహరించుకుంటున్నట్టు కోర్టుకు తెలిపారు. కేంద్రం సమర్పించిన అఫిడవిట్ వివరాలు తెలియజేయాలని కోరుతూ మధ్యంతర దరఖాస్తును ఆయన దాఖలు చేశారు. దానికి కూడా ధర్మాసనం అభ్యంతరం తెలుపడంతో, దాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపారు. తదుపరి విచారణను జనవరి 13కు వాయిదా వేస్తున్నట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది.

  • Loading...

More Telugu News