: దీపికకు 'విన్ డీజిల్'...అక్షయ్ కు 'విన్ పెట్రోల్'!


బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కథానాయిక దీపికా పదుకొనేకు కామెడీ కౌంటర్ ఇచ్చాడు. హాలీవుడ్ నటుడు విన్ డీజిల్ తో కలసి దిగిన ఫొటోను (ఇందులో ఆ నటుడి ముఖం కనపడదు) ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తూ, ఇతనెవరో చెప్పుకోండి? అన్నట్టుగా దీపిక ఇటీవల ఓ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. దాంతో 'హౌస్ ఫుల్ 3' షూటింగ్ సందర్భంగా అచ్చం విన్ డీజిల్ లా ఉన్న ఓ వ్యక్తితో అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్ ముఖ్ కలసి దిగిన ఫోటోను అక్షయ్ పోస్టు చేశాడు. దానికి 'విన్ డీజిల్, దీపికా పదుకొనేతో బిజీగా ఉండడం వల్ల, మేము 'విన్ పెట్రోల్'తో ఫోటో దిగాము' అంటూ కామెడీ క్యాప్షన్ కూడా పెట్టాడు. దీనికి దీపిక ఎలా స్పందిస్తుందో!

  • Loading...

More Telugu News