: బాగ్దాద్ లో షియా మసీదుపై ఆత్మాహుతి దాడి
షియా మసీదు ప్రాంగణంలో ఓ ఉగ్రవాది జరిపిన ఆత్మాహుతి దాడిలో ఎనిమంది దుర్మరణం పాలవగా, 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. మసీదు ప్రాంగణం మొత్తం రక్తసిక్తమయింది. ఈ ఘటన ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో జరిగింది. ఈ ఘటనకు తామే బాధ్యులమని ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకోకపోయినప్పటికీ... ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడ్డారని ఇరాక్ అధికారులు చెబుతున్నారు. ఇస్లాం రాజ్య స్థాపనే లక్ష్యమంటూ ప్రకటించుకునే ఐఎస్... తోటి షియా వర్గ ముస్లింలను ఊచకోత కోస్తుండటం ఆవేదన కలిగించే అంశం. ఇరాక్ తో పాటు పలు దేశాల్లో షియాలను ఐఎస్ ఉగ్రవాదులు పొట్టన పెట్టుకుంటున్నారు. షియా మసీదులపై దాడులకు తెగిస్తున్నారు.