: వరుణ్ ఆరోన్ కెప్టెన్సీలో ఆడనున్న ధోనీ
టీమిండియా బౌలర్ వరుణ్ ఆరోన్ నాయకత్వంలో మహేంద్ర సింగ్ ధోనీ ఆడనున్నాడు. ఈ సన్నివేశం విజయ్ హజారే టోర్నీలో చోటు చేసుకోనుంది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ధోనీ తన సొంత రాష్ట్రం జార్ఖండ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే జట్టు కెప్టెన్సీ బాధ్యతలను వరుణ్ ఆరోన్ చేపడుతున్నాడు. జట్టు పగ్గాలను చేపట్టాలని ధోనీని జార్ఖండ్ క్రికెట్ సంఘం కార్యదర్శి రాజేష్ వర్మ కోరినప్పటికీ, ధోనీ సున్నితంగా తిరస్కరించారు. అయితే మొత్తం టోర్నీకి ధోనీ అందుబాటులో ఉంటాడో లేదో అనుమానంగానే ఉంది. పాకిస్థాన్ తో సిరీస్ కు కేంద్ర ప్రభుత్వం ఓకే చెబితే... డిసెంబర్ 24 నుంచి జనవరి 5 వరకు ధోనీ టీమిండియాకు నాయకత్వం వహిస్తాడు.