: చెన్నైలో మరో నాలుగు రోజుల వరకు విద్యా సంస్థలకు సెలవు
తమిళనాడు రాజధాని చెన్నైలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు మరో నాలుగు రోజుల వరకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అంటే ఈ నెల 13 వరకు సెలవులు ఇస్తున్నట్టు తెలిపింది. భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన చెన్నైలో దెబ్బతిన్న పాఠశాలలు, కళాశాలల్లో మరమ్మతులు చేపట్టాల్సి ఉన్నందునే సెలవులు ప్రకటిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. మరోవైపు చెన్నైలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. రవాణాతో పాటు ఇతర వ్యవస్థలు మెరుగవుతున్నాయి.