: ఉగ్రదాడుల్లో ఈ ఏడాది 57 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు


మన దేశ రక్షణ కోసం, భారతీయులు సుఖశాంతులతో బతకడం కోసం ఈ ఏడాది ఏకంగా 57 మంది జవాన్లు ప్రాణ త్యాగం చేశారు. గత ఏడాది డిసెంబర్ 1 నుంచి ఈ ఏడాది నవంబర్ 30 వరకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను మట్టుబెట్టే క్రమంలో వీరంతా వీర మరణం పొందారు. దీనికి సంబంధించిన నివేదికను రక్షణశాఖ సహాయ మంత్రి రావు ఇందర్ జిత్ సింగ్ ఈ రోజు రాజ్యసభకు అందజేశారు. జూన్, నవంబర్ నెలల్లోనే 38 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని నివేదికలో పేర్కొన్నారు. ఏడాది కాలంలో 151 సార్లు పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.

  • Loading...

More Telugu News