: ఫేస్ బుక్ అంతగా నచ్చడం లేదంటూనే వాడేస్తున్న టీనేజర్లు!


సామాజిక మాధ్యమాల్లో ముందు నిలిచిన ఫేస్ బుక్ అంతగా బాగాలేదంటూనే వాడుతున్నామని చెబుతున్నారు టీనేజర్లు. ప్రముఖ రీసెర్చ్ సంస్థ 'ఫారెస్టర్' ఈ విషయాన్ని వెలువరించింది. గడచిన సంవత్సరం వ్యవధిలో అమెరికాలో ఫేస్ బుక్ వాడుకున్న టీనేజర్ల సంఖ్యలో మార్పు నమోదు కాలేదని, 78 శాతం మంది యువతీ యువకులు దీన్ని వాడుతున్నారని తెలిపింది. ఫేస్ బుక్ తో పోలిస్తే వీడియో షేరింగ్ సైట్ యూ ట్యూబ్ మరికొంత ముందు నిలిచిందని, దీన్ని 80 శాతం మంది వాడుతున్నారని పేర్కొంది. 12 నుంచి 17 సంవత్సరాల మధ్య ఉన్న టీనేజర్లలో 65 శాతం మంది ఫేస్ బుక్, 80 శాతం మంది యూ ట్యూబ్, 79 శాతం మంది స్నాప్ చాట్, 78 శాతం మంది ఫేస్ బుక్ అందిస్తున్న ఇన్ స్టాగ్రామ్ తమకు సంతృప్తిని ఇస్తున్నట్టు తెలిపారు. "మేము కచ్చితంగా చెప్పగలము. ఫేస్ బుక్ అందరికీ సంతృప్తిని ఇవ్వడం లేదని. ఇదే సమయంలో వారు దాన్ని వాడటం కూడా ఆపలేదు" అని ఫారెస్టర్స్ తన నివేదికలో పేర్కొంది. తమ స్నేహితులతో నిత్యమూ దగ్గరగా ఉండేలా చూస్తుండటమే ఫేస్ బుక్ విజయానికి కారణమని అభిప్రాయపడింది. మొత్తం 4,485 మంది టీనేజర్లను సర్వేలో భాగం చేశామని, తమ గణాంకాలు 1.5 శాతం వరకూ అటూ ఇటుగా ఉండవచ్చని వెల్లడించింది.

  • Loading...

More Telugu News